* హన్మకొండ లో నకిలీ వైద్యుల సెంటర్ ల ఫై రాష్ట్ర వైద్య మండలి తనిఖీలు*

Date: 2024-07-25
news-banner


అందరి టీవీ డిజిటల్ ,హనుమకొండ జిల్లా ప్రతినిధి 

 25--07-'24  గురువారం రోజున జాతీయ వైద్య మండలి,  రాష్ట్ర వైద్యమండలి ఆదేశాల మేరకు 
వైద్య టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు డా.వేములపల్లి నరేష్  కుమార్ మరియు  ఆంటీ క్వాకరి బృందండా .కొలిపాక వెంకటస్వామి, డా.వద్దిరాజు రాకేష్, డా సుదీప్ 
బృందం హన్మకొండ  లోని పలు నకిలీ వైద్య కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది . 

తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు,  పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా.నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ కోసం , నకిలీ వైద్య వ్యవస్థ  వైద్య పరంగా ఎటువంటి  విద్యార్హత లేకుండా పేద ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని నిలువు దోపిడీ చేస్తు, వచ్చి రాని వైద్యం చేస్తున్న  నకిలీ వైద్యుల పై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం అని తెలియ చేశారు.

నకిలీ వైద్యుడు  కె.శరత్ బాబు D ఫార్మసీ చదివి ఎంబీబీఎస్ వైద్యుని స్థాయిలో మై హెల్త్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు చికిత్స చేస్తూ మోసం చేస్తున్నట్టు గుర్తించారు,
సదరు ప్రభుద్ధుడు DMHO ఆఫీస్  ఫార్మసీస్ట్ గా  గవర్నమెంట్ జాబ్ చేస్తునట్లు సమాచారం ..

అలాగే నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ ఏర్పాటు చేసి  బెడ్స్ వేసి ఇష్టరీతినా  హై డోస్ ఆంటిబయోటిక్స్,  స్టెరోయిడ్స్ ఇస్తున్నట్లు అంజనీ క్లినిక్ నకిలీ వైద్యుడు  జి. సత్యం  ను గుర్తించి  తగు ఆధారాలు సేకరించారు . 

వీరిపైన NMC చట్టం 34,54 ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీస్కోనున్నట్లు వైద్య మండలి  అధికారులు తెలియ చేసారు . 

చాలా వరకు నకిలీ వైద్యులు ప్రథమ చికిత్స కేంద్రాల ముసుగులో  చట్ట వ్యతిరేకంగా ఆపరేషన్ లు చేయడం, రహస్య గర్భ విచ్చిత్తి  ఆపరేషన్స్  మరియు  మోకాళ్ళ నొప్పులకు అధిక మొతదులో పెయిన్ కిల్లర్  ఇంజెక్షన్స్, స్టెరోయిడ్స్ ఇస్తున్నారని వీటివల్ల తాత్కాలికంగా ఉపషమనం వచ్చినప్పటికి దీర్ఘాకాలంలో  కిడ్నీ ఫెయిల్యూర్,  షుగర్ సంబంధిత సమస్యలకు దారి తీస్తాయని తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు డా  రాకేష్, IMA రాష్ట్ర నాయకులు డా సుదీప్ తెలియచేసారు 

HRDA (హెల్త్  కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ వరంగల్ ) ప్రెసిడెంట్ డా.కొలిపాక వెంకటస్వామి మాట్లాడుతూ వైద్య పట్టా లేకుండా  వైద్యం ఎవరు చేయరాదని, పారామెడికల్ కోర్సు  చేసినవారు ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి  వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలని పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకోరాదు, ఇంజెక్షన్లు ఇవ్వడం, సెలైన్ లు పెట్టడం చేయరాదు, ప్రిస్క్రిప్షన్  రాయకూడదు. క్వాలిఫైడ్ డాక్టర్ వ్రాసిన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు ఇవ్వాలి అని మందుల దుకాణం యజమానులకు  సూచించారు.

సుమారు 70 % నకిలీ వైద్యులు RMP / PMP లుగా పేర్కొంటూ పట్టణ ప్రాంతాల్లోనే వుండి ప్రజల అవసరాలను ఆసరాగా తీస్కొని మోసం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందిస్తున్నామని వివిధ అసోసియేషన్ ల ద్వారా ప్రజలను,  ప్రభుత్వాలను తప్పు తోవ పట్టించే ప్రకటన లను ఆపాలని ,  
అర్హత కు మించి వైద్యం చేసే ప్రతి నకిలీ వైద్యుడు పైన చర్యలు తీస్కుంటామని పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా వి నరేష్ కుమార్ హె చ్చరించా



image

Leave Your Comments