పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మండల నాయకులు#అందరిటీవీ #పెద్దిసుదర్శన్ రెడ్డి #నర్సంపేట #హైదరాబాద్ #యశోదఆసుపత్రి

Date: 2026-07-29
news-banner
అందరి టీవీ డిజిటల్ న్యూస్|హైదరాబాద్, నల్లబెల్లి | జూలై 28, 2026:పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష!
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో పలువురు మండల నాయకులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్నను కలిసి ఆమెకు మనోధైర్యం కల్పించారు.
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఈ క్లిష్ట సమయంలో తాము అండగా ఉంటామని నాయకులు తెలిపారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గందే శ్రీలత శ్రీనివాస్ గుప్తా, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు పులి రమేశ్, నారక్కపేట సర్పంచ్ సంపత్, మేడపెల్లి సర్పంచ్ సాంబయ్య, రాంపూర్ సర్పంచ్ భాస్కర్, నాయకులు కోనకటి లింగారెడ్డి, అల్లె రజినీకాంత్, సాక్షి విలేఖరి సాంబయ్య, వ్యాపారవేత్త అల్లం శౌరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave Your Comments