అందరి టీవీ డిజిటల్ న్యూస్|
పెద్ది ఆరోగ్యం కోసం రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకం. నల్లబెల్లి: నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ నల్లబెల్లిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శ్రీ తాటిపెల్లి రవీందర్ గుప్తా, కోశాధికారి మార్త మార్కండేయ, నల్లబెల్లి దేవాలయ కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ పెందోట మురళీమోహన్ ఆచార్యులు, సహాయ పురోహితులు బ్రహ్మశ్రీ మియాపురం కరుణాకరాచార్యులు, ఆసం సుదర్శనాచార్యులు, పొనుగోటి రాజేశ్వరాచార్యులు, కిస్టోజు రవీంద్రాచార్యులు, కిస్టోజు అనిల్ శాస్త్రి, పెందోట సూర్యమోహనాచార్యులుతో పాటు నల్లబెల్లి మండల పురోహితులు పాల్గొన్నారు.
రుద్రాభిషేకం, రుద్రహోమ సంపుటిత మృత్యుంజయ హోమం, నవగ్రహ మరియు అష్టదిక్పాలక హోమాలు నిర్వహించి, అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజలకు సేవలు అందించాలని, ఆయన కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు ప్రత్యేకంగా చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.