వైద్య రంగంలో సేవలు: ధన్వంతరి అవార్డు అందుకున్న డాక్టర్ నరేష్ కుమార్!అందరిటీవీ డిజిటల్:హైదరాబాద్/వరంగల్ నారాయణగూడలోని కేఎంఐటీ (KMIT) ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ ఆరోగ్య విధానం (Healthcare Policy) రాష్ట్ర స్థాయి సదస్సు మరియు ధన్వంతరి ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో వరంగల్ వాస్తవ్యులు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ నరేష్ కుమార్ గారికి విశిష్ట పురస్కారం లభించింది.వరంగల్ (హన్మకొండ) లో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న 'శ్రీ శ్రీనివాస సన్‌షైన్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్' వ్యవస్థాపకులుగా ఉన్న డాక్టర్ నరేష్ కుమార్.. వరంగల్ మరియు దాని చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం అనేక ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ నిరంతర సేవలందిస్తున్నారు. ఆయన చేసిన ఈ ఉత్కృష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును అందజేశారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యుడికి వైద్య సేవలను మరింత సులభంగా చేర్చవచ్చనే అంశంపై కీలక సూచనలు చేశారు.