వరంగల్ నగరంలో వరుస ఘటనలు.. భయాందోళనలో ప్రజలు!#AndariTVDigitalNews #WarangalCity#CrimeNews #CrimeAlert #Police

Date: 2026-07-27
news-banner
అందరి టీవీ డిజిటల్ న్యూస్ వెబ్ డెస్క్:వరంగల్‌లో వరుస ఘటనలతో ఉలిక్కిపడ్డ నగరవాసులు.                                       
 కరీమాబాద్ ఉర్సు గుట్ట ఘటన మరవకముందే.. నగరంలోని మరో ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.
మరోవైపు నగరంలోని ఇంకో ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
వరుస ఘటనల నేపథ్యంలో రాత్రివేళల్లో భద్రతపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

Leave Your Comments