అందరి టీవీ డిజిటల్ ,వరంగల్ జిల్లా ప్రతినిధి
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ముదిగొండ గ్రామం లో నకిలీ వైద్యుడు /RMP అశోక్ ఆంటీ రాబిస్ వాక్సిన్ ఇంజక్షన్ వేయడం తో మణిదీప్ 10 సం || ల బాలుడు మృతి పై టీజీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది
ఘటనపై వివిధ సాంఘిక మాధ్యమాల ద్వారా వచ్చిన సమాచారం మేరకు తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ)వెంటనే స్పందించి సుమోటో స్వీకరించి వరంగల్ జిల్లా ఆంటీ క్వాకరీ బృందానికి జరిగిన సంఘటన పై విచారణ జరిపి నివేదిక అందచేయాలనీ చైర్మన్ డా మహేష్ కుమార్, రిజిస్ట్రార్ డా లాలయ్య ఆదేశాలు జారీ చేసారు.
వరంగల్ టీజీఎంసీ సభ్యులు డా ఎం.శేషు మాధవ్, టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా వి.నరేష్ కుమార్, రాష్ట్ర IMA వైస్ ప్రెసిడెంట్ డా అశోక్ రెడ్డి, వరంగల్ Ima ప్రెసిడెంట్ డా అన్వర్ మియా, వరంగల్ HRDA అధ్యక్షులు డా కొలిపాక వెంకట స్వామి, THANA రాష్ట్ర మాజీ అధ్యక్షులు డా రాకేష్, నేతృత్వం లోని వైద్యబృందం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి విచారణ చేయనుంది