రజక కుటుంబాలపై మడేలయ్య దీవెనలు ఉండాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

Date: 2026-07-18
news-banner

మడేలయ్య బోనాల పండుగలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్, టీపీసీసీ సభ్యులు పెండెం శ్రీలక్ష్మీరామానంద్.                        నర్సంపేట: నర్సంపేట పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో మడేలయ్య బోనాల పండుగను భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్, టీపీసీసీ సభ్యులు పెండెం శ్రీలక్ష్మీరామానంద్ హాజరయ్యారు. ఆలయంలో మడేలయ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మడేలయ్య కుల సంఘ బాధ్యులు మున్సిపల్ చైర్‌పర్సన్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.

అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ.. ఆ మహాదేవుడు మడేలయ్య స్వామి ఆశీస్సులు రజక కుల బాంధవులకు, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొల్లూరి లక్ష్మీనారాయణ, కొల్లూరి శ్రీహరి, ఐలోని శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, కొల్లూరి భాస్కర్, రాయరాకుల శ్రీనివాస్, గుడికందుల సదానందం, ఉప్పుల పరమేశ్వర్, పొదిల్ల రామ్ చందర్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపెల్లి సందీప్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉప్పుల షాలోమ్, చిక్కటి శివమణి, గుడికందుల శీను, వావిళ్ళ ఈశ్వర్, రజక కుల సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.                                           📺 ANDARI TV DIGITAL


ANDARI TV DIGITAL అనేది ANJALI MEDIA NETWORK PRIVATE LIMITED ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజా ప్రయోజనాల డిజిటల్ మీడియా వేదిక.


ప్రజా సమస్యలు, సామాజిక అంశాలు, బ్రేకింగ్ న్యూస్, ప్రత్యేక కథనాలు, ఆరోగ్య అవగాహన, పర్యాటక విశేషాలు, కళా–సాంస్కృతిక కార్యక్రమాలు, విద్య, ఉపాధి, ప్రేరణాత్మక కథనాలను నిష్పాక్షికంగా ప్రజల ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం.


"ప్రజల గొంతుకగా... ప్రజా సమస్యలకు పరిష్కార వేదికగా... నిజం వైపు నిలబడే డిజిటల్ మీడియా – ANDARI TV DIGITAL."


🌐 Website: www.anjalimediagroup.org

📍 Head Office: శ్రీనగర్ కాలనీ, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్

📍 Regional Office: రాగన్న దర్వాజా, బ్రాహ్మణవాడ, హనుమకొండ

📞 9959143079 | 9059013079 | 9059738940


👉 ప్రజా సమస్యలు, ఫిర్యాదులు, ప్రత్యేక కథనాలు లేదా మీ ప్రాంతంలోని ముఖ్య సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించండి.


ANDARI TV DIGITAL

"ప్రజల గొంతుక... ప్రజల కోసం... ప్రజలతో..."

Leave Your Comments