*నర్సంపేట మోడల్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ డా. సత్యశారద*#Warangal #WarangalCollector #DrSatyaSharada #Narsampet #ZPHSSchool #SurpriseInspection #TelanganaEducation #AndhariTVDigital

Date: 2026-07-16
news-banner
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: నర్సంపేట ZPHS పాఠశాల పరిశీలన
వరంగల్, జూలై 16:*|| అందరి టీవీ డిజిటల్ ప్రతినిధి|| వరంగల్ జిల్లా నర్సంపేట పాకాల రోడ్డులోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల (మోడల్), ఇంగ్లీష్ మీడియంను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం ఆకస్మికంగా సందర్శించి పాఠశాల నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాస సామర్థ్యం, పాఠ్యాంశాలపై అవగాహనను ప్రశ్నల ద్వారా పరీక్షించారు.విద్యార్థులు చురుకుగా చదువుపై దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.
అనంతరం  నాణ్యత పెంపు, విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదల కోసం సమర్థవంతమైన బోధనా విధానాలను అమలు చేయాలని సూచించారు ఉపాధ్యాయులను ఆదేశించారు.  ప్రతి విద్యార్థి పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని  సూచించారు.
పాఠశాలలో పరిశుభ్రత, మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, బోధన–అభ్యాస వాతావరణాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రధానోపాధ్యాయునిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలలో పరిశుభ్రంగా ఉండేలా చూడాలని  ఆదేశించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, జీవన నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులను సమగ్ర వ్యక్తిత్వంతో తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.ఈ సందర్శనలో ఆర్డిఓ నర్సంపేట ఉమారాణి, నర్సంపేట తహసిల్దార్ రవిచంద్ర రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.                                                                                                                                                                                                                    రిపోర్టర్: రంజిత్ కుమార్, అందరి టీవీ కరస్పాండెంట్

Leave Your Comments