చెట్టుకు ఉరివేసుకుని ఆటో డ్రైవర్ ఆత్మహత్య
అందరి టీవీ డిజిటల్ న్యూస్ – నల్లబెల్లి, జూలై 16:
నల్లబెల్లి మండలం శనిగారం రహదారిపై గురువారం ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. రహదారి పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మకు ఉరివేసుకుని సదరు వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మృతుడిని అశోక్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ కుప్పాల దేవేందర్‌గా గుర్తించారు. మృతునికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదానికి కుటుంబ కలహాలే కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.- అందరి టీవీ వెబ్ డెస్క్|| అందరి టీవీ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ ||