గ్రేటర్ వరంగల్‌లో అనధికార ఫ్లెక్సీలు, బిల్‌బోర్డుల తొలగింపు... గ్రేటర్ వరంగల్ నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) డి ఆర్ ఎఫ్ బృందాలు ఏసీపీ ల నేతృత్వంలో గురువారం నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అంబెడ్కర్ సర్కిల్, హన్మకొండ మిషన్ హాస్పిటల్, సర్క్యూట్ గెస్ట్ హౌస్, వరంగల్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, బిల్‌బోర్డులు, ప్రచార బోర్డులను తొలగించాయి.
ఈ సందర్భంగా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న మాట్లాడుతూ, నగర సౌందర్యానికి భంగం కలిగించే విధంగా ఎవరూ విచ్చలవిడిగా ఫ్లెక్సీలు, బిల్‌బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. నగర సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో వారం రోజుల వ్యవధిలో నగరంలోని అన్ని అనధికార ఫ్లెక్సీలు, బిల్‌బోర్డులను పూర్తిగా తొలగించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
రెండో విడతలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, గోడలపై అనుమతి లేకుండా రాసిన వాల్ రైటింగ్స్, పోస్టర్లు, పెయింటింగ్‌లను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించే ఆకర్షణీయమైన వాల్ పెయింటింగ్‌లు రూపొందించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
జీడబ్ల్యూఎంసీ పరిధిలో నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నగరంలో ఉన్న అన్ని అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్లు, బిల్‌బోర్డులను పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని కోరారు.
పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు లేదా ఇతర సంస్థలు మున్సిపల్ అనుమతి లేకుండా ఎలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు, ప్రచార బోర్డులు ఏర్పాటు చేయరాదని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై మున్సిపల్ చట్టాల ప్రకారం భారీ జరిమానాలు విధించడంతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, పార్కులు, విద్యుత్ స్తంభాలు, సెంట్రల్ డివైడర్లు, రహదారి కూడళ్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రయాణికుల ప్రాంగణాలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా గోడపత్రికలు, స్టిక్కర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, ప్రచార బోర్డులు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధించబడిందని కమిషనర్ తెలిపారు.
స్వచ్ఛమైన, సుందరమైన, క్రమబద్ధమైన గ్రేటర్ వరంగల్ నిర్మాణమే జీడబ్ల్యూఎంసీ లక్ష్యమని. నగర సౌందర్యాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని అన్నారు. ప్రజలందరూ మున్సిపల్ నిబంధనలను పాటిస్తూ నగరాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ టి. వెంకన్న కోరారు.📺 ANDARI TV DIGITAL#AndariTVDigitalNews
#GreaterWarangal
#GWMC
#WarangalNews
#FlexiRemovalDrive
#IllegalFlexies
#UnauthorizedBoards
#SpecialDrive
#CleanWarangal
#GWMCCommissioner
#Venkanna
#WarangalUpdates
#CivicAction
#PublicAwareness
#NoIllegalFlexies
#UrbanDevelopment
#MunicipalNews
#TelanganaNews
#DigitalNews
#AndariTV
ANDARI TV DIGITAL అనేది ANJALI MEDIA NETWORK PRIVATE LIMITED ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజా ప్రయోజనాల డిజిటల్ మీడియా వేదిక.
ప్రజా సమస్యలు, సామాజిక అంశాలు, బ్రేకింగ్ న్యూస్, ప్రత్యేక కథనాలు, ఆరోగ్య అవగాహన, పర్యాటక విశేషాలు, కళా–సాంస్కృతిక కార్యక్రమాలు, విద్య, ఉపాధి, ప్రేరణాత్మక కథనాలను నిష్పాక్షికంగా ప్రజల ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం.
"ప్రజల గొంతుకగా... ప్రజా సమస్యలకు పరిష్కార వేదికగా... నిజం వైపు నిలబడే డిజిటల్ మీడియా – ANDARI TV DIGITAL."
🌐 Website: www.anjalimediagroup.org
📍 Head Office: శ్రీనగర్ కాలనీ, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్
📍 Regional Office: రాగన్న దర్వాజా, బ్రాహ్మణవాడ, హనుమకొండ
📞 9959143079 | 9059013079 | 9059738940
👉 ప్రజా సమస్యలు, ఫిర్యాదులు, ప్రత్యేక కథనాలు లేదా మీ ప్రాంతంలోని ముఖ్య సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించండి.
ANDARI TV DIGITAL
"ప్రజల గొంతుక... ప్రజల కోసం... ప్రజలతో..."