"పర్స్ డ్రామా.. ప్రియుడి దాడి.. భర్త హత్య!"వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త హత్య.. ప్రియుడితో కలిసి భార్య కుట్ర. చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, తమిళనాడులోని సూలగిరి పరిధిలోని దేవసానపల్లెకు చెందిన రమేష్ హోసూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం కుప్పం నియోజకవర్గంలోని బోయనపల్లెకు చెందిన హాసినితో అతనికి వివాహం జరిగింది. వీరికి ఏడాది వయస్సు గల మౌలికశ్రీ అనే కుమార్తె ఉంది.
ఇటీవల రమేష్, హాసిని, వారి కుమార్తెతో కలిసి బైక్‌పై సంగనపల్లె సమీపంలోని మల్లప్పకొండ మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. అయితే రాత్రి అయినా కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి రాకపోవడంతో హాసిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆలయ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. మొదట రమేష్, హాసిని, చిన్నారితో కలిసి ఆలయానికి వెళ్లిన దృశ్యాలు కనిపించగా, తిరుగు ప్రయాణంలో హాసిని మరో ఇద్దరు యువకులతో కలిసి రమేష్ బైక్‌పై వెళ్తున్నట్లు గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా హాసిని ముందస్తు ప్రణాళిక ప్రకారం తన పర్స్‌ను ఉద్దేశపూర్వకంగా పడేసి, కొంతదూరం వెళ్లిన తర్వాత పర్స్ మరిచిపోయానని రమేష్‌కు చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. పర్స్ తీసుకురావడానికి రమేష్ వెళ్లగా, అక్కడ ముందుగానే వేచి ఉన్న హాసిని ప్రియుడు యుగంధర్‌తో పాటు అతని స్నేహితులు రమేష్‌పై దాడి చేసినట్లు వెల్లడైంది.
దాడిలో రమేష్ మృతి చెందగా, మృతదేహాన్ని అక్కడే వదిలేసి హాసిని నిందితులతో కలిసి రమేష్ బైక్‌పైనే రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజ్‌లు మరియు ఇతర సాక్ష్యాల ఆధారంగా అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టిన పోలీసులు, మల్లప్పకొండ ఘాట్ రోడ్ సమీపంలో రమేష్ మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, భార్య హాసిని ప్రియుడితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.📺 ANDARI TV DIGITAL
ANDARI TV DIGITAL అనేది ANJALI MEDIA NETWORK PRIVATE LIMITED ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజా ప్రయోజనాల డిజిటల్ మీడియా వేదిక.
ప్రజా సమస్యలు, సామాజిక అంశాలు, బ్రేకింగ్ న్యూస్, ప్రత్యేక కథనాలు, ఆరోగ్య అవగాహన, పర్యాటక విశేషాలు, కళా–సాంస్కృతిక కార్యక్రమాలు, విద్య, ఉపాధి, ప్రేరణాత్మక కథనాలను నిష్పాక్షికంగా ప్రజల ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం.
"ప్రజల గొంతుకగా... ప్రజా సమస్యలకు పరిష్కార వేదికగా... నిజం వైపు నిలబడే డిజిటల్ మీడియా – ANDARI TV DIGITAL."
🌐 Website: www.anjalimediagroup.org
📍 Head Office: శ్రీనగర్ కాలనీ, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్
📍 Regional Office: రాగన్న దర్వాజా, బ్రాహ్మణవాడ, హనుమకొండ
📞 9959143079 | 9059013079 | 9059738940
👉 ప్రజా సమస్యలు, ఫిర్యాదులు, ప్రత్యేక కథనాలు లేదా మీ ప్రాంతంలోని ముఖ్య సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించండి.
ANDARI TV DIGITAL
"ప్రజల గొంతుక... ప్రజల కోసం... ప్రజలతో..."