అందరి టీవీ స్పోర్ట్స్ , Jul 13, 2024,
జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించింది. 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (93), శుభ్‌మన్ గిల్ (58) ఆఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. అంతకుముందు జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది