నర్సంపేటలో అక్రమ ఆసుపత్రులపై చర్యలు ఎందుకు లేవు? నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హాస్పిటల్స్‌పై అధికారుల మౌనం ఎందుకు ? #AndariTVDigital #Narsampet #IllegalHospitals #HealthDepartment #PublicHealth #HospitalViolations #LocalNews #Investigation #Accountabil

Date: 2026-01-19
news-banner
 నర్సంపేటలో అక్రమ ఆసుపత్రులపై చర్యలు ఎందుకు లేవు?
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హాస్పిటల్స్‌పై అధికారుల మౌనం ఎందుకు ? 
అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రత్యేకం 
నర్సంపేట పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా, అవసరమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా కొనసాగుతున్న పలు ప్రైవేట్ ఆసుపత్రులపై ఇప్పటివరకు అధికారులు  కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ కీలక అంశంపై అధికారుల నిర్లక్ష్యం విమర్శలకు తావిస్తోంది.

క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన అనుమతులు, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్లు, బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ పత్రాలు లేకుండానే కొన్ని ఆసుపత్రులు నిర్బంధం లేకుండా కొనసాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ, సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు ఇప్పటివరకు కఠిన చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినా, సోషల్ మీడియాలో అంశం చర్చకు వచ్చినా అధికారుల స్పందన మాత్రం నోటీసుల వరకే పరిమితం అవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడువు ఇచ్చి వదిలేయడం తప్ప, ఆసుపత్రులపై సీలింగ్ లేదా లైసెన్స్ రద్దు వంటి చర్యలు ఎందుకు కనిపించడం లేదన్నది ప్రధాన ప్రశ్న.

స్థానిక వర్గాల కథనం ప్రకారం,

కొంతమంది ప్రభావవంతుల ఒత్తిళ్లు

రాజకీయ సిఫార్సులు

అధికారుల మధ్య సమన్వయ లోపం
వంటివే చర్యలు ఆలస్యం కావడానికి కారణాలుగా వినిపిస్తున్నాయి.

మరోవైపు, అక్రమంగా నడిచే ఆసుపత్రుల వల్ల పేద ప్రజలు మోసపోతున్నారని, సరైన వైద్య సదుపాయాలు లేకుండా ప్రాణాపాయం ఎదుర్కొంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా చర్యలు లేకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది.

ప్రభుత్వం పదే పదే “ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యత” అని చెబుతున్నా, నర్సంపేటలో మాత్రం ఆ మాటలు ఆచరణలో కనిపించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటారా..? లేక ఈ వ్యవహారం కూడా కాలక్రమంలో మరిచిపోతుందా..? అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి
అధికారుల ఆశీస్సులతో కొనసాగిస్తున్న ఆస్పత్రుల వివరాలను  అందరి టీవీ సేకరించింది 
ఆస్పత్రుల వివరాలతో ప్రత్యేక కథనంలో చూడండి 

image

Leave Your Comments