అందరిటీవీ డిజిటల్ / ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నగరవాసులు ఫ్రూట్ జ్యూస్ లు తాగుతున్నారా తస్మాత్ జాగ్రత్త...
నగరంలో పలు జ్యూస్ సెంటర్లలో వెలుగు చూసిన దారుణాలు..
కుళ్ళిన పళ్ళతో పళ్ళ రసాలను తయారు చేస్తున్న జ్యూస్ పాయింట్ ల గుట్టు రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు
జ్యూస్ కావవి విషం ;
టాస్క్ఫోర్స్ దాడుల్లో భయంకర విషపదార్థాలతో జ్యూస్ తయారీ చేస్తున్న హనుమకొండ నగరంలోని బరిష్ట జ్యూస్ పాయింట్ తో పాటు కొన్ని జ్యూస్ పాయింట్స్ లను ఫుడ్ సేఫ్టీ, టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు
విష రసాయనాలతో పళ్ళు కుళ్ళిపోకుండా నిల్వ ఉంచడమే కాకుండా, పళ్ళ రసాలు రంగు మారకుండా రుచిని తలపించేందుకు విష రసాయనాలను వాడుతున్నట్లు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు..
బరిష్ట జ్యూస్ పాయింట్ లో వెలుగు చూసిన దారుణాలు..
19 రకాల సుమారు 21,420 రూపాయల విలువ గల ఫ్రూట్ జ్యూస్ ఉత్పత్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీన పరచుకున్నారు
నాణ్యత పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యాలతో చలగాటమాడుతున్న వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సదరు వ్యాపారులపై కేసులు సైతం నమోదు చేయాలని వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇలాంటి సెంటర్ లలో ఏమైనా తేడాలుంటే మాకు తెలియచేయాలని అధికారులు తెలిపారు