అందరి టీవీ డిజిటల్ వార్తలు ,రంజిత్ కుమార్ వరంగల్ జిల్లా కరస్పాండెంట్ , ఏప్రిల్ 10:
వైద్య విద్యా అర్హతలు లేకుండా ప్రజలకు కంటి వైద్య సేవలు అందిస్తున్న డెక్కన్ ఆప్టీకల్స్ యజమాని ఎం. జనార్దన్ పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డి.లాలయ్య కుమార్ చైర్మన్ కె. మహేష్ కుమార్ ల ఫిర్యాదు మేరకు మట్వడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది.
వరంగల్ జె.పి.ఎన్ రోడ్‌లో ఉన్న ఈ సంస్థలో జనార్దన్ తనను కంటి వైద్యుడిగా ప్రదర్శిస్తూ, ప్రజలను మోసం చేస్తున్నట్టు తనిఖీ లలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు గుర్తించారు .
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రకారం, వైద్యుడిగా అనధికారంగా పని చేయడం ఎన్‌ఎంసీ చట్టం 34,54 మరియు టీ ఎస్ ఎం పి ఆర్ చట్టం 22 సంబంధిత నిబంధనల ప్రకారం శిక్షార్హం.
నకిలీ వైద్యులు పట్ల అప్రమత్తత చాలా అవసరం - ప్రజలకు ముఖ్య సూచన
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రజా సంబంధాల కమిటీ చైర్మన్ డా నరేష్ కుమార్ మాట్లాడుతు , “ఆప్టోమెట్రిస్టులు లేదా సహాయకులు రెఫ్రాక్షన్ సేవలు (అంటే కంటి డిగ్రీలు కొలవడం) మాత్రమే చేయాలి. కానీ వైద్య సలహాలు ఇవ్వడం, కంటి వ్యాధులకు మందులు సూచించడం లేదా శస్త్ర చికిత్సల పేరుతో మోసం చేయడం చట్టవిరుద్ధం” అని పేర్కొన్నారు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం - మెడికల్ కౌన్సిల్ హెచ్చరిక
ఎలాంటి అర్హత లేకుండా వైద్య వృత్తి ప్రాక్టీస్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కౌన్సిల్ వైస్ చైర్మన్ డా శ్రీనివాస్ స్పష్టం చేసారు . అక్రమ వైద్య సేవలతో ప్రజల ఆరోగ్యమే కాదు, ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి,
అధికారిక వైద్యుల గుర్తింపులు పరిశీలించి మాత్రమే వైద్యం తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నకిలీ వైద్యుల బారిన పడితే, స్థానిక పోలీసులకు లేదా మెడికల్ కౌన్సిల్
కి antiquackerytsmc@onlinetsmc.in మెయిల్ ద్వారా
లేదా
91543 82727 నెంబర్ కి వాట్సాప్ ద్వారా
ఫిర్యాదు చేయాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.