అకాల వర్షాలు.. అపార నష్టం..ఆందోళనలో మిర్చి, వరి రైతులు.. ములుగు జిల్లాలో ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం | AndariTV Digital News | Mulugu District | Gangadhar

Date: 2025-04-11
news-banner
అందరి టీవీ డిజిటల్ వార్తలు ,గంగాధర్ ,ములుగు జిల్లా ప్రతినిధి 
చేతికొచ్చిన పంట చేజారింది ములుగు జిల్లాలో పురుగుల మందు తాగి ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం..

ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతులు..

అకాల వర్షాలు అన్నదాతలను నట్టేట ముంచుతున్నాయి.వడగండ్ల వానలతో ములుగు జిల్లాలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.గత నాలుగు రోజుల పాటు కురుస్తున్న వడగండ్ల వానలతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఈదురు గాలులతో కూడిన వడ గండ్ల వర్షాలకు వరి,మిర్చి నేల రాలడంతో లక్షల రూపాయల పెట్టుబడి నీళ్లలో కలిసిపోయిందని రైతులు కంట తడి పెడుతున్నారు.నిన్న రాత్రి కురిసిన వడ గండ్ల వర్షానికి మంగపేట మండలం మొట్లగూడెం కు చెందిన రైతు నర్సింగరావు  15 ఎకరాలు వరి,2 ఎకరాల మిర్చి,5 ఎకరాల మొక్క జొన్న వడ గండ్ల వర్షానికి నేల రాలడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మ హత్య యత్నానికి పాల్పడ్డాడు.వెంటనే అతనికి ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.ప్రస్తుతం అతడి పరిస్తితి నిలకడగానే ఉంది.వాజేడు మండలంధర్మారం  కు చెందిన మరో రైతు బోటా నర్సింగరావు 2 ఎకరాల మిర్చి తోట వేయగా ఫర్టిలైజర్ షాపు యజమాని తన అప్పును తీర్చాలని తన తోటలో ఉన్న మిర్చి బస్తాలను తీసుకొని వెళ్ళాడని అప్పు తీర్చే స్తోమత లేక పురుగుల మందు తాగి ఆత్మ హత్య యత్నానికి పాల్పడ్డాడు.ప్రస్తుతం ఇద్దరు రైతుల పరిస్తితి నిలకడగానే ఉంది.మరో పక్క కన్నాయి గూడెం మండలం లో రాత్రి కురిసిన వడ గండ్ల వర్షానికి మిర్చి తడిసిందనీ పెట్టిన పెట్టుబడి రావడం లేదని అమ్ముదా మంటే కనీస గిట్టుబాటు ధర లేకుండా పోయిందని ఇక రైతులకు ఆత్మ హత్యలే శరణ్యం అని రైతులు వాపోతున్నారు.ప్రభుత్వం తమను ఆదుకోవాలనే మిర్చి, వరి కి గిట్టు బాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు..
image

Leave Your Comments