అందరి టీవీ డిజిటల్ వార్తలు ,కామిశెట్టి రంజిత్ కుమార్ ,వరంగల్ జిల్లా కరస్పాండెంట్
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సోమవారం నర్సంపేటలోని ద్వారకా పేటలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాల (బాలికలు) ను సందర్శించడం జరిగింది.
ఈ సందర్శనలో పదవతరగతి విద్యార్థుల తో ఇట్రాక్ట్ అయ్యారు.పదవ తరగతి పరీక్షలు బాగా రాసి పాస్ అవ్వాలని సూచించారు. పదవతరగతి పాస్ అయ్యాక విద్యార్థులు ఏ కోర్సు తీసుకుంటారు అనే దానిపైన విద్యార్థులతో సంభాషించారు.10వ తరగతి అనేది విద్యార్థిని విద్యార్థినులకు బంగారు భవిష్యత్ కి టర్నింగ్ పాయింట్ అని వారు అన్నారు.
అనంతరం కిచెన్, స్టార్ రూమ్ ను తనిఖీ చేశారు. స్టోర్ రూమ్,కిచెన్ ను అస్తవ్యస్తంగా అపరి శుభ్రంగా ఉండటాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. ప్రతి నిత్యం శుభ్రంగా ఉండేలా చూడాలని హాస్టల్ వార్డెన్ ను ఆదేశించారు.
ఈ సందర్శనలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి ఎమ్మార్వో రాజేష్ తదితరులు వారి వెంట తదితరులు ఉన్నారు.