అందరి టీవీ డిజిటల్ ,జాతీయం
లోక్ సభ ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ప్రతిపక్షాల కూటమి ఫ్లోర్ లీడర్ సమావేశంలో అందరూ రాహుల్ గాంధీ పేరునే ఎంపిక చేసినట్లుగా వేణుగోపాల్ వెల్లడించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేరును ఖరారు చేసినట్లు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ స్పీకర్ ప్రొటెం భర్తృహరి మెహతాబ్‌కు లేఖ రాశారు