అందరి టీవీ డిజిటల్ / మహబూబాద్ న్యూస్
వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్ దగ్గర ముగ్గురు వ్యక్తులు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారం రాగా కేసముద్రం ఎస్సై మురళీదర్ తన సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా వారిని పట్టుకుని విచారించగా వారి పేర్లు బానోత్ హరినాధ్ s/o మంగ్య, 22yr, రైల్వే కూలి r /o ఇంటికన్నే, కేసముద్రం
గుగులోత్ చరణ్ s/o రవి, 20yr, కూలి r/o బాల్య తండ, బయ్యారం మండలం
లునవత్ ప్రవీణ్ కుమార్ s/o శ్రీహరి, 21yr, లంబాడా, కూలీ, r/o గమ్య తండ, మరిపెడ అని తెలిపి సదరు ముగ్గురు కలిసి రైలులో వెళ్లి ఒడిస్సాకు చెందిన నబీన్ ప్రధాన్ అను వ్యక్తి వద్ద నాలుగు కిలోల గంజాయి (విలువ రూ. 100000/-)కొనుక్కొని రైలులో మహబూబాబాద్ వచ్చి అక్కడి నుండి కేసముద్రం వచ్చి, వాహనం కోసం ఎదురు చూస్తుండగా , పోలీస్ వారు పట్టుకొని అట్టి వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది , నాలుగో వ్యక్తి నబీన్ ప్రధాన్ పరారిలో ఉన్నారని మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య తెలిపారు. ప్రతిభ కనబర్చి గంజాయి రవాణాదారులను పట్టుకున్న రూరల్ సీఐ సర్వయ్యని, కేసముద్రం ఎస్ఐ మురళీధర్, పిసి లు నరేష్, రామకృష్ణ, చంద్రయ్య,మధు లను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అభినందించారు.