13 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు టీచర్ల గ్యాంగ్ రేప్ ,ఉపాధ్యాయులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు / Breaking news / andaritv digital

Date: 2025-02-07
news-banner
అందరి టీవీ డిజిటల్ / జాతీయం 
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా బార్గూర్ పట్టణంలోని పంచాయితీ మాధ్యమిక పాఠశాలలో దారుణం 
13 ఏళ్ల విద్యార్థినిపై అదే పాఠశాలలోని ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ముందు ఒక ఉపాధ్యాయుడు అత్యాచారం చేసిన విషయం తెలిసి, మరుసటి రోజు మరో ఇద్దరు ఉపాధ్యాయులు బలవంతంగా మరుగుదొడ్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు.
అమ్మయి కుటుంబసభ్యులు కృష్ణగిరిలోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆ  ముగ్గురు ఉపాధ్యాయులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
విద్యాధికారులు ముగ్గురిని సస్పెండ్ చేశారు.
విద్యా బుద్దులు నేర్పాల్సిన గురువులు ఇంత నీచానికి దిగజారడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

image

Leave Your Comments