అందరి టీవీ డిజిటల్ / వరంగల్ ప్రతినిధి
మంత్రి కొండా సురేఖ తన మానవీయ హృదయాన్ని మరోసారి చాటుకున్నారు. ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని హన్మకొండ వస్తున్న క్రమంలో జక్కలొద్ది క్రాస్ రోడ్డు (ఉర్సు గుట్ట) వద్ద ప్రమాదం జరగడంతో కాన్వాయ్ లోని పోలీసు వాహనంలో గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను ఎంజిఎం హాస్పిటల్ కు పంపించారు.
వారికి మెరుగైన వైద్యం అందించాలని ఎంజిఎం సూపరిండెంట్ కు ఫోన్ లో ఆదేశాలు జారీ చేశారు