అందరి టీవీ డిజిటల్ ,వరంగల్ జిల్లా ప్రత్యేకం
సామాన్యులకు వర్తించే నిబంధనలు సంపన్నులకు వర్తించడం లేదు
సక్రమంగా అన్ని ఉండి కార్యాలయాలకు వెళితే వారికీ కానీ పనులు
అక్రమార్కులకు మాత్రం వారి పనులు చకా చకా అవుతున్నాయి
ఇంకా ఆశర్యం ఏంటంటే వారిచ్చే తాయిలాలు అందుకొని
అవతలి వారి ఆధారాలు సైతం తారు మారు చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం
మమ్ముల్ని ఎవరు ఏమి చేయలేరు అనేది వారి ధీమా ....
ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజా ప్రతినిధుల అండ దండలతో బరి తెగించిన
అధికారులు, ప్రభుత్వం మారినా కూడా అదే విధమైన తంతు కొనసాగిస్తూ వారి వద్ద కు వచ్చే వారిలో సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తూ సంపన్నులకు మాత్రం పెద్ద పీట వేస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వ కార్యాలయాల్లో పరిస్థితి
తాజా గా నర్సంపేట తహశీల్ధార్ కార్యాలయంలో సైతం అదే పరిస్థితి దాపురించిందని పలు ఆరోపణలు వినవస్తున్నాయి
కాసులు ఇచ్చినవారికి ఏ పనైనా అవుతుంది అదే తీరుగా అన్ని పత్రాలు సరిగా ఉన్నా మా పని చేయకపోవడంతో పాటు మమ్ముల్ని ఇబ్బదులకు గురి చేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ప్రభుత్వ అసైన్డ్ భూములను సక్రమైనవిగా మారుస్తూ మున్సిపాలిటీ కి అట్టి భూములకు అనుమతులు ఇప్పించడంలో ఓ ఇద్దరూ రెవెన్యూ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం
సర్వే నెంబర్ లను సైతం తారు మారు చేయడంలో వారికీ వారే సాటి
ఉన్నదీ లేనట్టుగా లేనిదీ ఉన్నట్లు గా సృష్టించడంలో ఇద్దరూ ఇద్దరే ...
ఆ ఇద్దరి పై విచారణ జరుపాలని పలువురి డిమాండ్ ..
ఎవరా ఇద్దరు...ఇంతకీ బాధితులు ఏం చెపుతున్నారు
మరో ప్రత్యేక కార్యక్రమంలో .....