అల్లు అర్జున్ ఖైదీ నంబర్ 7697 / Allu Arjun Arest / Chanchalguda Jail / Nembur 7697 -AndariTv Digital News

Date: 2024-12-14
news-banner
 అందరి టీవీ డిజిటల్ / డెస్క్ ప్రత్యేకం    హీరో  అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 
కోర్టు తీర్పుతో అల్లు అర్జున్ ను చంచల్‌గూడ జైలుకు తరలించారు  పోలీసులు.
 12గంటల 15నిమిషాలకు జూబ్లీహిల్స్‌ నివాసంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.విచారణ అనంతరం ఆస్పత్రిలో పరీక్షలు  పూర్తయిన  తరవాత నాంపెల్లి కోర్టు లో హాజరుపరుచగా వాదోపవాదాలు విన్న అనంతరం కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది 
అక్కడి నుండి చంచల్ గూడా జైలు కు తరలించారు పోలీసులు 
ఇంతలోనే హై కోర్టు నుండి మధ్యంతర బెయిల్ లభించింది 
అప్పటికే జైలు కు తరలించడం డాక్యుమెంటేషన్ ప్రక్రియలో ఆలస్యం అవ్వడంతో 
అల్లు అర్జున్ విడుదల ఆలస్యం అయ్యింది.
 ఈ రోజు  ఉదయం  విడుదల కానున్నారు  అల్లు అర్జున్. 
రాత్రంతా జైల్లోనే ఉంచారు 
 సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ ను ఏ 11గా చేర్చారు పోలీసులు. పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లారు. అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా అభిమానులు పోటెత్తారు. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కొడుకు చావుబ్రతుకుల మధ్య హాస్పటల్ లో ఉన్నాడు. దాంతో పోలీసులు థియేటర్ యాజమాన్యం, అలాగే అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసింది. కాగా ఈ రోజు ( శుక్రవారం) అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం అల్లు అర్జున్ ను తన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు పోలీసులు.
చంచల్‌గూడ జైలు నుండి విడుదల కానందున అల్లు అర్జున్‌ను అండర్ ట్రైల్ ఖైదీగా.. ఖైదీ నంబర్ 7697 ఇచ్చి మంజీరా బ్యారక్ క్లాస్-1 రూంలో ఉంచిన పోలీసులు
image

Leave Your Comments