అందరి టీవీ డిజిటల్ / క్రైం టీమ్
👉హన్మకొండ లో నకిలీ వైద్యులకు మందుల అక్రమ రవాణా ని గుట్టు రట్టు చేసిన మెడికల్ టాస్క్ ఫోర్స్ టీం
హన్మకొండ జిల్లాకేంద్రంలో
ఔషద నియంత్రణ అధికారులు, తెలంగాణ వైద్య మండలి అధికారులు సంయుక్తంగా
మెడికల్ ఏజెన్సీలలో తనిఖీలు నిర్వహించారు
పలువురు RMP / PMP / నకిలీ వైద్యులకి అక్రమంగా మందుల పంపిణీని చేయడాన్ని గమనించి ఆధారాలతో సహా బయటపెట్టగా ఇచ్చామని అంగీకరించిన మెడికల్ ఏజెన్సీ యాజమాన్యం
పలువురు నకిలీ వైద్యుల కి పంపిణీ చేసినట్టు కీలక ఆధారాలు లభ్యం
ఇంకా కొన్ని మెడికల్ ఏజెన్సీలపై కూడా తనిఖీల కోసం మెడికల్ టాస్క్ ఫోర్స్ టీం ప్రణాళిక
నగరం లోని మిగతా మెడికల్ ఏజెన్సీల ద్వారా మందులు అక్రమంగా సేకరిస్తున్న RMP /PMP /నకిలీ వైద్యుల జాబితా సేకరిస్తున్న తెలంగాణ వైద్య మండలి అధికారులు
ఎవరతే నిబంధనలకు విరుద్ధంగా వారికీ మందులు అమ్ముతున్నారో వారిపై చర్యలు తీసుకుంటామని టీజీఎంసీ బృందం మరియు ఔషద నియంత్రణ అధికారి తెలిపారు
ఈ తనిఖీలలో హన్మకొండ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ ,టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వేములపల్లి నరేష్ కుమార్ ,సభ్యులు డాక్టర్ శేషుమాధవ్ తదితరులు పాల్గొన్నారు