అందరి టీవీ /డిజిటల్ /హనుమకొండ ప్రతినిధి
హనుమకొండ లో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఇందిరా మహిళ శక్తి మరియు ప్రజా పాలన విజయోత్సవ సభకు విచ్చేసిన ముఖ్య అతిథి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,
సభాధ్యక్షుడు జిల్లా అధ్యక్షులు మరియు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , మంత్రి సీతక్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , వరంగల్ ఎంపీ కడియం కావ్య , ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న , మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ డప్పు, జ్ఞాపిక మరియు గజమాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సన్మానించారు .
అనంతరం డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ
ప్రజా పాలన విజయోత్సవ సభ వరంగల్ గడ్డపై నుంచి మొదలు కావడం చాలా ఆనందంగా ఉంది, సీఎం రేవంత్ వరంగల్ పై వరాల జల్లు కురిపించడం వరంగల్ ప్రజలు చేసుకున్న పుణ్యం అని, అండర్ డ్రైనేజ్ మరియు వరంగల్ ఎయిర్ పోర్ట్ మరియు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్ కేటాయించినందుకు, ముఖ్యమంత్రి చల్లని చూపు వరంగల్ పై ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం లోని నలుమూలల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని డాక్టర్ రామకృష్ణ అన్నారు.