సమగ్ర కుటుంబ సర్వే.. ఈ పత్రాలు రెడీగా పెట్టుకోండి!

Date: 2024-11-09
news-banner


అందరి టీవీ /డిజిటల్ /డెస్క్ ప్రత్యేకం 

సమగ్ర కుటుంబ సర్వే.. ఈ పత్రాలు రెడీగా పెట్టుకోండి!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం ప్రారంభమైంది. సర్వేలో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. వీటి నుంచి సమాచారం సేకరిస్తారు. భూమి వివరాలు సేకరించే క్రమంలో ధరణి పట్టా నెంబరు, మెట్ట, తరి, పడావు వంటి భూమి రకం, ఎకరాలు గుంటల రూపంలో ఎన్యుమరేటర్​కు చెప్పాల్సి ఉంటుంది. సాగు విస్తీర్ణం వివరాలు అనగా నీటి పారుదల వనరు, కౌలు భూమి సాగు వివరాలు చెప్పాలి. ఆధార్ కార్డులు, రైతులైతే అదనంగా ధరణి పాస్​ పుస్తకాలు దగ్గర ఉంచుకోవాలి. సర్వే చేసినప్పుడు సులువుగా వివరాలు అందించవచ్చు.
image

Leave Your Comments