అందరి టీవీ / డిజిటల్ /మహబూబాబాద్ ప్రతినిధి
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం ఏనుకుంట తండా కి చెందిన బానోత్ ఐశ్వర్య, 16 సంవత్సరాలు గిరిజన బాలిక కి నకిలీ వైద్యుడు చెన్నా సారయ్య వైద్యం చేయడం తో గత నెల 25న మృతి చెందిన ఘటనపై సుమోటా గా తీసుకున్న తెలంగాణా మెడికల్ కౌన్సిల్ సభ్యులు డా శేషు మాధవ్, డా నరేష్ కుమార్ నేతృత్వంలో వరంగల్ ఐ ఎం ఎ అధ్యక్షులు డా అన్వార్ మియా, వరంగల్ లీగల్, ఆంటీ క్వాకరీ కమిటీ ఫైనాన్స్ సెక్రటరీ డా శిరీష్, సభ్యుడు డా రితేష్ ల కూడిన బృందం విచారణ చేపట్టింది.
మహబూబాబాద్ జిల్లా హరిపిరాల లో చట్ట విరుద్ధంగా ఎటువంటి అర్హత లేకుండా వైద్యం నిర్వహిస్తున్న నకిలీ వైద్యుడు చెన్న సారయ్య నిర్వహిస్తున్న సెంటర్ ను తనిఖీ చేసిన వైద్య బృందం సారయ్య కు వైద్య పరంగా ఎటువంటి విద్యార్హత లేదని, కనీసం పదవ తరగతి కూడా పాస్ అవకుండానే ఆర్ఎంపి గా అవతారం ఎత్తి తెలిసి తెలియని వైద్యం చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టు టీజీఎంసీ బృoదం గుర్తించి తగు ఆధారాలు సేకరించింది.
అనుమతి లేని సారయ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో ఫార్మసిస్ట్ లేకుండా సాయిరాం మెడికల్ షాప్ నిర్వహిస్తూ అతనే షెడ్యూల్ H మందులు సైతం క్వాలిఫైడ్ డాక్టర్ ప్రెస్క్రిప్షన్ లేకుండా మందులు కూడా విక్రయిస్తున్నాడని డ్రగ్ కంట్రోల్ అధికారులకి ఫిర్యాదు చేయనున్నట్లు మరియు ఫార్మసీ పర్మిషన్ కి సర్టిఫికెట్ ఇచ్చి నిర్వహణ లోపాలకి బాధ్యత వహిస్తూ ఫార్మసీ సర్టిఫికెట్ ఇచ్చిన గజవెల్లి స్వాతి పై చర్యలు తీసుకోవాలని ఫార్మసీ కౌన్సిల్ కి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా నరేష్ కుమార్ తెలియ చేశారు.
నకిలీ వైద్యుడు సారయ్య పై ఎన్ ఎం సి చట్టం 34,54 ప్రకారం కేసు కూడా ఫైల్ చేయనున్నట్లు టీజీఎంసీ సభ్యులు డా శేషు మాధవ్ తెలియ చేశారు.
తరువాత ఏనుకుంట తండా లోని మృతురాలి ఇంటికి వెళ్లిన బృందం కుటుంబ సభ్యులను పరామర్శించి బాలిక పెదనాన బానోత్ శంకర్ ఇచ్చిన సమాచారం ప్రకారం మృతురాలు తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉండగా జ్వరం రావడం తో స్థానికంగా రక్త పరీక్షలు చేపించగా కామెర్లు ఉన్నాయని నిర్ధారణ అయిందని జ్వరం తోపాటు వాంతులు అవుతుండగా హరిపిరాల కి చెందిన నకిలీ వైద్యుడు చెన్న సారయ్య ని సంప్రదించగా తన వైద్యం తో అన్ని నయం చేస్తా అని నమ్మ పలికి పూర్తి హామీ ఇచ్చి వైద్యం ఇచ్చాడని సెలైన్ బాటిల్స్ పెట్టడం తో పాటు నాలుగు రకాల ఇంజెక్షన్స్ కూడా తన మెడికల్ స్టోర్స్ నుండి తెచ్చి వేసాడని తర్వాత కొద్దిసేపటికే నురగా వచ్చి ఆపస్మారక స్థితికి వెళ్లడంతో హుటాహుటిన ఆటోలో తొర్రూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రి కి పంపిచ్చాడని అక్కడ పరీక్షించిన వైద్యులు ఐశ్వర్య మృతి చెందిందని ప్రకటించారు, నకిలీ వైద్యుడు సారయ్య ఇచ్చిన ఇంజక్షన్స్ వల్లనే మృతి చెందిందని కుటుంబ సభ్యులు విచారణ బృందం తో కన్నీటి పర్యంతం అయ్యారు.
తొర్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, మహబూబాబాద్ గవర్నమెంట్ ఆసుపత్రి లో శవ పరీక్ష నిర్వహించారని తెలియచేసారు.
RMP / pmp లు వైద్యులు కారని ప్రజలు తెలిసి తెలియక వాళ్ల వద్దకి వెళ్లి వారు తెలిసి తెలియక ఇచ్చే ఎటువంటి ఇంజెక్షన్స్ తీస్కొని ప్రాణం మీదకు తెచ్చుకోవద్దని వరంగల్ జిల్లా ఐ ఎం ఎ అధ్యక్షులు డా అన్వార్ మియా తెలియ చేశారు.