రోగులకు విలువైన ఆరోగ్య సేవలు అందించాలని ....... వైద్య ఆరోగ్యశాఖ.....

Date: 2024-11-08
news-banner

అందరి టీవీ /డిజిటల్ /ఏటూర్ నాగారం ప్రతినిధి 
ములుగు జిల్లా ఆరోగ్య వైద్యాశాఖ అధికారి డాక్టర్. గోపాలరావు , జిల్లా మాత శిశు సంరక్షణ మరియు పోషకాహార ప్రోగ్రాం ఆఫీసర్. శ్రీకాంత్. డాక్టర్ ప్రసాద్  ఏటూర్ నాగారం సామాజిక వైద్యశాలను సందర్శించారు. సామాజిక వైద్యశాల లోని ఐసిటిసి హెచ్ఐవి కౌన్సిలింగ్ సెంటర్, న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్, నవజాతి శిశువు కేర్ యూనిట్ ను మరియు రక్త నిధి సెంటర్ ను సందర్శించినారు. నవజాతి శిశు కేరి యూనిట్ లోని శిష్యుల ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు తర్వాత న్యూట్రిషన్  సెంటర్ మరియు రక్తనిధుల రికార్డులను పరిశీలించినారు రోగులకు విలువైన ఆరోగ్య సేవలు అందించి వైద్య శాఖపై నమ్మకం  పెరిగేలా సేవలు అందించాలని వైద్య సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్. గౌతం, డాక్టర్. అనిల్, డెమో సంపత్ మొదలగువారు పాల్గొన్నారు.
image

Leave Your Comments