అందరి టీవీ / డిజిటల్ /హైదరాబాద్ ప్రతినిధి
రిజర్వ్ కాలనీలో రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో వేడుకలు
భారీ శబ్ధాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం
తనిఖీలు చేసి 24 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు
హైదరాబాద్ సమీపం జన్వాడలోని ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించడంతో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడలోని రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫాంహౌస్‌లో శనివారం పార్టీ నిర్వహించారు. భారీ శబ్ధాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందటంతో పోలీసులు అక్కడకు వెళ్లారు.
తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఇక్కడ పార్టీలో పాల్గొన్న 24 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఓ వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.