అందరి టీవీ / డిజిటల్ /డెస్క్ ప్రత్యేకం
నేడు తమిళ్ హీరో విజయ్ దళపతి తమిళగ వెట్రి కళగం అనే పార్టీ తొలి బహిరంగ సభ నేడు జరగనుంది, విల్లు పురం లోని విక్ర వండి లో ఈ సభకు సర్వం సిద్ధమైంది, తొలి మహానాడుకు ఐదు లక్షల మందికి సరిపడ పార్టీ నేతలు ఏర్పాటు చేశారు.
ఇక తాజాగా,ఈ రోజు ఆదివారం మొట్టమొదటి సారి పార్టీకి సంబంధించి తొలి రాజకీయ భారీ బహిరంగ సభ నిర్వహించ బోతున్నారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పెరియార్ రామస్వామి లతో పాటు తమిళనాడు రాజకీయ ఉద్దండుల కటౌట్‌ల మధ్య విజయ్ కటౌట్‌తో సభా ప్రాంగణాన్ని అలంకరిం చారు.
ఇక ఈ సభకు హాజరయ్యే పార్టీ కార్యకర్తలు, అభిమా నులకు విజయ్ పార్టీ నుంచి కీలక సూచనలు కూడా వచ్చాయి. గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు, బాలబాలికలు ఈ సదస్సులో పాల్గొనవద్దని, ఆన్‌లైన్‌లో తమ సభను చూడాలని పార్టీ అధినాయకత్వం కోరింది.
ఈ సదస్సులో పాల్గొనేందు కు ఇతర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే వారు వెహికల్ కెపాసిటీ ప్రకారమే ప్రజల్ని తీసుకురావాలి. ద్విచక్రవాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. వాహనాలను సదస్సుకు వెళ్లే దారిలో వైన్ షాపుల దగ్గర పార్కింగ్ చేయకూడదని...
మరీ ముఖ్యంగా మందు తాగి రావడానికి ప్రయత్నం కూడా చేయవద్దు. అలాంటి వారిని ఎట్టిపరిస్థితుల్లో సభా ప్రాంగణంలోకి అనుమతి లభించదు. ఇదిలా ఉంటే విజయ్ రాజకీయ రంగప్రవేశం పై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం విమర్శలు చేస్తున్నారు.
అయితే విజయ్ మాత్రం తాను ఇకపై పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెడతానని, సినిమాలు చేయనని కూడా ఇంతకు ముందే ప్రకటన కూడా చేశారు..