అందరి టీవీ/ డిజిటల్ /పెద్దపల్లి ప్రతినిధి
కాయ కష్టం చేసుకునే మధ్యతరగతి కుటుంబా లకు చెందిన ప్రజలు తమ పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం రూపాయి రూపాయి జమ చేసుకుని పోస్టాఫీసులో పొదుపు చేసుకుంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నకిలీ పాసు పుస్తకాలతో లక్షల్లో మోసానికి పాల్పడి పేదప్రజలను మోసం చేసింది.
నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి పొదుపు ఖాతాల్లోని డబ్బు స్వాహా చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా బేగంపేటలో జరిగింది. కాగా బేగంపేట పోస్టాఫీస్ ఎదుట ఖాతాదారులు తమ పాసు పుస్తకాలతో తమ డబ్బులు తమకు ఇప్పించాలంటూ డిపాజిటర్లు ఈరోజు ఆందోళన చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు పేరుతో పల్లెల్లో తపాల శాఖ లావాదేవీలు జరుపుతోంది.
బ్యాంకుల మాదిరిగా అన్ని నగదు లావాదేవీలు చేపడు తోంది. ఈ వ్యవహారంపై పర్యవేక్షణ, జవాబుదారీ తనం లేక రామగిరి మండ లం బేగంపేట పోస్టాఫీసులో బ్రాంచ్ పోస్టుమాస్టర్ హేమ చేతివాటం ప్రదర్శించింది,
ఈ పోస్టాఫీసు పరిధిలో దాదాపు సుమారు 400 మంది ఖాతాదారుల నుంచి సుమారు కోటి రూపాయ లు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కాజేసినట్లు సమాచారం. డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ నగదును నకిలీ పాసుపుస్తకాలతో పక్కదారి పట్టించింది..
బేగంపేట బ్రాంచ్ పోస్టో మాస్టర్‌గా విధులు నిర్వహి స్తున్న హేమ ఖాతాలు తెరిచేందుకు వచ్చిన నిరక్షరాస్యులను గుర్తించి, వారికి నకిలీ పాస్ పుస్తకాలు అంటగట్టింది, వారి ఖాతాల్లో జమచేసిన నగదును తన సొంత అవసరాలకు వినియోగిం చుకున్నారని, ఖాతాదా రులు ఆరోపించారు.
ఇటీవల బదిలీపై వచ్చిన సబ్ పోస్ట్ మాస్టర్ శివ కూమార్ పలు ఖాతాలపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా ఆమె చేసిస మోసం బయట పడింది. దీంతో కొంతమంది ఖాతాదారులను పిలిపించి వారి పాసుపుస్తకాలు పరిశీలించగా అవి నకిలీవిగా తేలింది.
ఈ విషయాన్ని ఉన్నతాధి కారులకు తెలపడంతో తపాలాశాఖ ఉన్నతాధి కారులు విచారణ జరుపుతున్నారు. కాగా తాను చేసిన తప్పును క్షమించాలని.. ఒక నెల సమయమిస్తే నెలలోపు అందరి డబ్బులు తిరిగి చెల్లిస్తానని ఖాతాదారు లను మోసం చేసిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ హేమ తెలిపింది.