అందరి టీవీ డిజిటల్ ,వరంగల్ జిల్లా ప్రత్యేకం
నర్సంపేట నియోజకవర్గం ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ప్రత్యేక నియోజకవర్గం గా చెప్పుకోవచ్చు
అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదు గత పాలకుల చేతిలో అనేది ఇక్కడి ప్రజల మాట
బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయం లో ఇచ్చిన హామీలన్నీ చెత్తబుట్టలోకి మొదలుపెట్టిన పనులన్నీ అసంపూర్తిగానే మిగిలిపోయాయని ప్రజలు కలత చెంది
జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో సిట్టింగ్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని ఓడించి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి కి పట్టం కట్టారు ప్రజలు
గెలిచినప్పటి నుండి వరుస గా ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నప్పటికీ
దీర్ఘ కాలిక ప్రయోజనాలకోసం నర్సంపేట అభివృద్ధి,, ప్రజల సంక్షేమం రెండు కండ్లు గా
ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు
వారికీ కొంత సమయం ఇచ్చి ప్రణాళికలు చేయమని చెపుతూనే
ముఖ్యంగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో అంతర్గత రోడ్లు ,డ్రైనేజీలు ,ముఖ్యంగా త్రాగు మరియు సాగు నీటి పై దృష్టి సారించారు
ఎప్పటికప్పుడు అటు ప్రజలకు ఇటు అధికారులకు చేరువలో ఉంటూ సామాన్యుడిని సైతం తన వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకునే లా వీలు కల్పించారు
ముఖ్యంగా అందరికి చేరువలో ఉండడానికి ఆర్ అండ్ బి అతిధి గృహాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా మార్పులు చేర్పులు చేయించి నూతనంగా తీర్చిదిద్దుతున్నారు
సీనియర్ కాంగ్రెస్ నేతగా అధిష్టానం వద్ద మంచి పేరున్న దొంతి నియోజక అభివృద్ధి పై మాత్రమే ఫోకస్ పెట్టినట్లు చెప్పవచ్చు
తన ఎన్నికల్లో తాను గెలవడమే కాకుండా ,ఎంపీ ,గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో సైతం నియోజక వర్గం
మార్క్ ను చూపించేలా నాయకులకు ,కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసి విజయం సాధించారు
అధిష్టానం వద్ద మంచి పేరు సంపాదించుకున్నారు
క్యాబినెట్ లో ఉన్న అందరు మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కి సైతం సన్నిహితులుగా ఉన్న దొంతి మాధవరెడ్డి హుందాగా వ్యవహరిస్తూ నియోజక వర్గ అభివృద్ధి కోసం కోట్ల రూపాయలతో పనులకు ఏర్పాటు చేసినట్లు చెప్పవచ్చు
అసంపూర్తిగా మిగిలిపోయిన పాఖాల ఆడిటోరియం ,నాన్ వెజ్ మార్కెట్ ,
ప్రారంభానికి నోచుకోని వెజిటేబుల్ మార్కెట్ నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల నిర్మాణ పనుల వేగవంతం ఇలా అన్నింటిపై అధికారులతో మాట్లాడి సకాలంలో వాడుకలోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు
అయితే ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకపోవడం ,తాను ప్రజలకు మాత్రమే జవాబుదారీ
అంటూ ముందుకు సాగడం మాధవరెడ్డి నైజంగా చెప్పుకోవచ్చు
కొందరు ఊహాగానాలతో తన వ్యక్తి గత ప్రతిష్ట దెబ్బతీసేలా చేస్తున్న కూడా
ఓ చిరు నవ్వు ప్రజలు ఇబ్బంది పడకుండా చూడండి , పనికి రాని మాటలను మనం పట్టించుకోవద్దు అంటూ నేతలకు చెప్పినట్లు సమాచారం
అభివృద్ధి అంటే మనం ఎదుగడం కాదు ప్రజలందరూ బాగుండాలి అని వారి సమస్య లను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురండి అని
క్యాంపు కార్యాలయంలో తనను కలవడానికి విచ్చేసిన పాత్రికేయులకు చెప్పడం జరిగింది
తమ నేతలెవరైనా ఏదైనా తప్పు చేసినా తప్పకుండా తన దృష్టికి తీసుకురావాలని
వారి పై నేనే చర్యలు తీసుకుంటానని పాత్రికేయులను కోరినట్లు చెప్పవచ్చు
ఏది ఏమైనా విమర్శలకు లొంగడు ,ప్రశంసలకు పొంగడు చెప్పింది నవ్వుతు వింటాడు
చేయాలనుకున్నది నిక్కచ్చిగా చేస్తాడు ఈ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అని చెప్పవచ్చు