అందరి టీవీ /డిజిటల్ /హనుమకొండ ప్రతినిధి
అంజలి మీడియా గ్రూప్ పదవ వార్షికోత్సవ సందర్భంగా కాకతీయ మహానంది పురస్కారం 2024 మరియు సాంస్కృతిక కార్యక్రమములకు సంబంధించిన పోస్టర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చే ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా అందరు టీవీ ఎన్నో విజయాలు సాధించి ప్రజల పక్షాన ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల మన్ననలను పొందుతుందని అన్నారు. నవంబర్ 2 వ తేదీ 10వ వార్షికోత్సవ సందర్భంగా హనుమకొండ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో వివిధ రంగాల్లో కృషిచేసిన ఉత్తమోత్తములైన మహానీయులకు కాకతీయ మహానంది, జాతీయ స్థాయిలో అవార్డులు, ఇతర పురస్కారాలను అందజేయడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమం లో అంజలి మీడియా గ్రూప్ చైర్మన్ కామిశెట్టి రాజు పటేల్ గారు ,డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ,స్టేట్ కరస్పాండెంట్ జంగా రఘువీర్ యాదవ్ ,ఆర్గనైజర్లు నాగజ్యోతి,కామిశెట్టి రంజిత్ కుమార్ పటేల్ , ప్రత్యుష, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు .