హనుమకొండలో జీవో 29కి వ్యతిరేకంగా బిసి పొలిటికల్ జాక్ ఆందోళన

Date: 2024-10-22
news-banner


అందరి టీవీ / డిజిటల్ /తెలంగాణ ప్రతినిధి 

అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన 

బీసీ పొలిటికల్ జాక్ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నేతలు ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, డాక్టర్ ఖాళి ప్రసాద్, డాక్టర్ లక్ష్మి ప్రసాద్ నేతృత్వంలో పెద్ద ఎత్తున హాజరైన ఆందోళనకారులు

 ఈ సందర్భంగా   బీసీ పొలిటికల్ జాక్ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ 

జీవో 29 ను ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా తీసుకువచ్చిందని ఆరోపించారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ ఇతర అభ్యర్థులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం బ్యాక్ డోర్ తో తలుపులు తెరిచిందని,  ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు జీవో 29 తో మరణ శాసనం లికిస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి వరంగల్ ఎలా కేంద్రమైందో అదే తరహాలో ఇక్కడి నుంచి మరో బీసీ ఉద్యమం ఉద్భవిస్తుందని ,  ప్రభుత్వ విధానాలు ఇలాగే ఉంటే వేలాదిమంది బీసీలు ప్రభుత్వంపై దండెత్తాల్సిన అవసరం వస్తుందని హెచ్చరించారు.   కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసారు. 
కామారెడ్డి డిక్లరేషన్ తో సహా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ అభ్యర్థుల నియామకాల్లో ప్రభుత్వం సింహభాగం కేటాయించాలని,  బీసీ పొలిటికల్ జాక్ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు
image

Leave Your Comments