10వ తరగతి విద్యార్థుల కోసం టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ ..... చైర్మన్ వడ్లకొండ వేణు గౌడ్

Date: 2024-10-22
news-banner

అందరి టీవీ / డిజిటల్ / హనుమకొండ ప్రతినిధి 
ఈ నెల 27 వ తేదీన  హనుమకొండలోని  మోషన్ ఐఐటీ నీట్ ఇన్స్టిట్యూట్ లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం మోషన్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్  నిర్వహిస్తున్నట్లు మోషన్ ఐఐటీ నీట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. హన్మకొండ నయీమ్ నగర్ మోషన్ ఐఐటీ నీట్ ఇన్స్టిట్యూట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎగ్జామ్ మోషన్ ఐఐటీ నీట్ ఇన్స్టిట్యూట్ హెడ్ సెంటర్ కోటా రాజస్థాన్ వారు నిర్వహిస్తున్నారని ఈ ఎగ్జామ్స్ లో దేశ వ్యాప్తంగా ప్రతిభ కనపరచిన వారికోసం రూ. 150 కోట్లు స్కాలర్షిప్, రూ. 2 కోట్ల ప్రైజ్ మనీ, 500 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందివ్వనున్నట్లు తెలిపారు.
image

Leave Your Comments