పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలు చిరస్మరణీయం....

Date: 2024-10-21
news-banner
అందరి టీవీ /డిజిటల్ /వరంగల్ ప్రతినిధి 

-వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

 శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన  పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయం నిలిచిపోతారని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములోఅమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే)ను ఘనంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 241మంది పోలీస్ అమరవీరుల పేర్లను అదనపు డీసీపీ రవి చదివి వినిపించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గోన్న వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డా.సత్య శారద , ప్రావీణ్య, కర్నల్ రవికుమార్ రవి,డిసిపిలు షేక్ ,సలీమా రవీందర్ తో పాటు అదనపు ఏ.సి.పిలు, ఏ.సి.పిలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్. ఐలు పోలీస్ . అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాగుచ్చాలు వుంచి నివాళులు అర్పించిన పిదప, ఆర్.ఐ స్పర్జన్ సారధ్యంలో సాయుధ పోలీసులు 'శోక్ శ్రస్త్  చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సేవకోసం తమ ప్రాణాలను ఆర్చించిన పోలీసులు మహనుభావులని, పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోరకు పాటుపడాలని, ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నిత్, నీజాయితీతో పనిచేయాల్సి వుంటుందని పోలీసు అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు ఎల్లప్పుడు మన గుండెల్లోనే వుంటారని, వారు మన మధ్య లేనకున్నా మనం వారిని స్మరిస్తునే వుంటామని, అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవల్సిన భాధ్యత మనందరిపై వుందని, వారికి ఎలాంటి సమస్య వున్న వారికి పోలీస్ విభాగం తరుపున పూర్తి సహకారం అందజేయడం:
జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయము నుండి మిషన్ హస్పటల్ వరకు నిర్వహించిన ర్యాలీలో పోలీసులు అధికారులు, సిబ్బంది పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో పాటు పోలీసు జాగృతి కళాబృందం
సభ్యులు పాల్గోని పోలీసు అమరవీరులకు జోహర్లు అర్పించారు
image

Leave Your Comments