అందరి టీవీ /డిజిటల్ /వరంగల్ ప్రతినిధి
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని నేడు రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ , వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ప్రారంభించారు. అనంతరం మార్కెట్ ఆఫీస్ ఆవరణలో రైతులు మరియు కొనుగోలుదారుల సమస్యల మీద మంత్రి , ఎమ్మెల్యే వినతులు స్వీకరించి వారి పట్ల సానుకూలంగా స్పందించారు. మొదటిసారిగా మార్కెట్ విచ్చేసిన సందర్భంగా మార్కెట్ సెక్రటరి మంత్రి సురేఖ , ఎమ్మెల్యే నాగరాజు లకు పుష్పగుచ్చం అందజేసి మరియు శాలువాతో సన్మానించారు. మార్కెట్ సమస్యల మీద మంత్రి, ఎమ్మెల్యే కు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాకలెక్టర్ సత్య శారదా దేవి, అదనవు కలెక్టర్ సంధ్యారాణి, సిసిఐ జనరల్ మేనేజర్ అర్జున్, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బొమ్మినేనీ రవీందర్ రెడ్డి, స్థానిక డివిజన్ కార్పొరేటర్ తూర్పాటి సులోచన - సారయ్య , ప్రజాప్రతినిధులు, మార్కెటింగ్, వ్యవసాయ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు....