వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు పై టీపీసీసీ గీత సెల్ సెక్రటరీ రావుల వెంకట రమేష్ గౌడ్ ఆగ్రహం

Date: 2024-10-20
news-banner

అందరి టీవీ డిజిటల్ / డెస్క్ ప్రత్యేకం 
నమ్మి వెంట నడిచిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై విషం చిమ్ముతున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు అని 
టీపీసీసీ గీత సెల్ సెక్రటరీ రావుల వెంకట రమేష్ గౌడ్ ప్రకటన ద్వారా తెలియచేశారు 
..........................
వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విషం చిమ్ముతున్నారని టీపీసీసీ గీత సెల్ సెక్రటరీ రావుల వెంకట రమేష్ గౌడ్ ఆరోపించారు.
 కనీసం తనను నమ్ముకుని వెంట నడిచిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను అనుచరులను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి సమస్యలు చెప్పుకుంటే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరు మీరు అని ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు గారు ప్రశ్నించడం ఎంతవరకు సబబు ఎమ్మెల్యే గారు జవాబు చెప్పాలన్నారు
 కష్టాల్లో ఉన్న కార్యకర్తలు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ లో కూడా అందుబాటులో ఉండకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారు అన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు p A అనిల్ షాడో ఎమ్మెల్యే లాగా ప్రవర్తిస్తు  సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను అనుచరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు పార్టీ కార్యక్రమాలకు మరియు ఇందిరమ్మ కమిటీలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు  ఇట్టి విషయమై త్వరలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అవిశ్రాంతంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఇబ్బందులను తెలియజేస్తానని
అందరి ని కలుపుకుని మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నామని ఫోన్ ద్వారా    వెంకట రమేష్ గౌడ్ తెలిపారు
image

Leave Your Comments