తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్..!!

Date: 2024-10-20
news-banner

అందరి టీవీ /డిజిటల్ /తెలంగాణ ప్రతినిధి 

తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సంబంధిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడనం ఏర్పడింది. సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడి, 23వ తేదీ నాటికి ఉత్తర వాయువ్యానికి కదులుతుంది. 

ఈ అల్పపీడనం ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జైశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్ , మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జైశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. 

అదనంగా, సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రభావిత ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
image

Leave Your Comments