విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని నర్సంపేట ఆర్డిఓ కి ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతి పత్రం

Date: 2024-06-28
news-banner

అందరి టీవీ డిజిటల్ ,నర్సంపేట 
విద్యార్థి విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డిఓ కృష్ణవేణి గారికి వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పడ్డాక విద్యావ్యవస్థ మెరుగుపడుతుందనుకుంటే అది కాకుండా రాష్ట్రంలో మద్యానికి ఉన్న విలువ విద్యకు లేదు అని మండి పడ్డారు, రాష్ట్రంలో మద్యం శాఖకు మంత్రి ఉన్నాడు కానీ విద్యా శాకకు లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని అన్నారు,నేడు రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ,
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ పాఠశాలలో అక్రమంగా లక్షల లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న యజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలనీ, రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలులోకి తీసుకురావాలనీ,ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలనీ వెంటనే ఎంఈఓ డీఈఓ లను నియమించాలనీ మాట్లాడారు,
మెగా డీఎస్సీ ద్వారా ఒకేసారి 24 వేలకు పైగా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను భర్తీ చేయాలనీ,
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు 25% సీట్లు కేటాయించాలని అన్నారు, ప్రభుత్వ గుర్తింపు మరియు నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలనీ,
ప్రభుత్వ పాఠశాలలో పెడుతున్న మధ్యాహ్న భోజనంలో జరుగుతున్న అవకతవకల పైన విచారణ జరిపించి నాణ్యతలేని ఆహారాన్ని అందిస్తున్న అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ, ప్రభుత్వ పాఠశాలలలో అటెండర్ మరియు స్కావెంజర్లను నియమించాలనీ కొరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్నాల శశికుమార్ కార్యకర్తలు :- ఆది, సూర్యతేజ, హేమంత్, సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.
image

Leave Your Comments