వీడియో కాల్ చేసి అభిమానికి ధైర్యం చెప్పిన జూనియర్​ ఎన్టీఆర్​..

Date: 2024-09-16
news-banner
అందరి టీవీ /డిజిటల్ 

 క్యాన్సర్​తో బాధపడుతున్న తన అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియోకాల్ చేసి ధైర్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కౌశిక్ కొంతకాలంగా ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో తాను చనిపోయేలోపు దేవర చూడాలని కోరుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. కౌశిక్ తల్లి ఎన్టీఆర్ అభిమానుల ద్వారా ఆ విషయాన్ని తారక్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ కౌశిక్ కు వీడియో కాల్ చేసి ఆప్యాయంగా పలకరించారు. కౌశిక్ ధైర్యంగా కోలుకొని బయటకు రావాలని, దేవర సినిమా చూడాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కౌశిక్ ను జాగ్రత్తగా చూసుకోవాలని ఎన్టీఆర్ సూచించారు.

 ధైర్యంగా కోలుకుని బయటకు రావాలి -దేవర చూడాలి.. 'ధైర్యంగా క్యాన్సర్​ నుంచి కోలుకుని బయటకు రావాలి. దేవర సినిమా చూడాలి. సినిమా అనేది తర్వాత విషయం ముందు నువ్వు కోలుకుని రావాలి. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి' అని కౌశిక్​తో జూనియర్​ ఎన్టీఆర్​ అన్నారు. 'అన్నా మిమ్మల్ని అస్సలు చూస్తానని ఊహించలేదు అని కౌశిక్​ అనగా నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో అని తారక్​ బదులిచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఎల్లప్పుడూ షూటింగ్​లలో బిజీబిజీగా ఉండే హీరో ఓ సామాన్యుడికి కాల్​ చేసి మాట్లాడటం అది కూడా క్యాన్సర్​తో బాధపడుతున్న ఓ అబ్బాయికి అంటే అర్థం చేసుకోవచ్చు జూనియర్​ ఎన్టీఆర్​ గొప్పతనాన్ని. కౌశిక్​తో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఆయన అభిమానులు ఆ వీడియోను ఎక్స్​లో ట్వీట్​ చేశారు.

image

Leave Your Comments