వినాయకుడిని అందుకుం నిమజ్జనం చేస్తారు ?

Date: 2024-09-16
news-banner
అందరి టీవీ/డిజిటల్ :స్పెషల్ 
 శనివారం వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రకరకాల వినాయక ప్రతిమలను ప్రతిష్టించారు. ఇప్పుడు వారంతా నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. విశ్వవ్యాప్తంగా ఉండే ఉత్సవాలన్నీ ఒక ఎత్తు అయితే.. నిమజ్జనోత్సవం మాత్రం మరో ఎత్తు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. వినాయకుని విగ్రహాలను నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారు.. దీని వెనుక కారణాలేంటనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

హిందూ సంప్రదాయం ప్రకారం, భాద్రపద సుద్ద చవితి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. తర్వాత సరిగ్గా పదిరోజుల తర్వాత అంటే అనంత చతుర్దశి రోజున వినాయక నిమజ్జనం జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడి విగ్రహాలను ప్రవహించే నదులు, కాలువలు లేదా ఏదైనా చెరువులో నిమజ్జనం చేస్తారు. అంతకుముందు రోడ్లపై ఘనంగా యువత డీజే డ్యాన్సులు, మేళ తాళాలు, డ్రమ్స్, వాయిద్యాల నడుమ ఊరేగింపు  నిమజ్జనోత్సవం నిర్వహిస్తారు.

మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజు మొదటిగా వినాయక చవితిని ప్రారంభించారని చాలా మంది చెబుతారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ లో బాల గంగాధర్ తిలక్ ప్రారంభించారని చెబుతారు. ఇక పూర్వ కాలంలో అయితే శాతవాహనులు, చోళులు వినాయక చవితి పండుగను జరుపుకున్నట్లు కొందరు నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.


వినాయక చవితి పండుగ వర్షాకాలంలోనే వస్తుంది. ఈ కాలంలో చెరువుల నుండి మట్టి సేకరించి.. ఆ మట్టితోనే వినాయక విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించి, తర్వాత తిరిగి అదే నీటిలో నిమజ్జనం చేస్తారు. ఆ నీటిలో పత్రితో కలిపి నిమజ్జనం చేయడం వల్ల నీరు సులభంగా ప్రవహించేందుకు వీలు కలుగుతుంది. అంతేకాదు ఆయుర్వేద గుణాలు కలిసిన ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు
గణేష్ విగ్రహాలను తయారు చేసేందుకు వాడిన మట్టి, పత్రి, గరిక ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే చిన్న చిన్న పురుగులు, కీటకాలన్నీ మరించి నీరు శుభ్రంగా మారుతుంది.  ఏ దేవుని విగ్రహమైనా మట్టితో పూజించేందుకు 9 రోజులు మాత్రమే అర్హత ఉంటుంది. ఆ తర్వాత అందులోని దైవత్వం మాయమవుతుందని, అందుకే వినాయక ప్రతిమలను తొమ్మిది రోజులు పూర్తయ్యక నిమజ్జనం చేయాలని చెబుతారు.


పురాణాల ప్రకారం, వినాయకుడు అనంత చతుర్దశి రోజున తన తల్లిదండ్రులు పార్వతీపరమేశ్వరుల దగ్గరికి వెళ్తాడు. వినాయక నిమజ్జనం మనుషుల చావు, పుట్టుక చక్రాల ప్రాముఖ్యతను సూచిస్తుంది. నిమజ్జనం నిమిత్తం వినాయకుడి విగ్రహం బయటకు తీస్తున్నప్పుడు ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్మకం. వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు.


👉ఎప్పటికప్పుడు మరింత సమాచారం కొరకు www.andharitv.com ను సబ్స్క్రయిబ్ చేయండి ,
 అప్డేట్స్ తెలుసుకోండి ,
మరియు అందరి టీవీ ప్రత్యక్ష ప్రసారాలను, అంజలి ott లో ప్రత్యేక షో లు, ఇతర ఛానెల్ లను ఉచితంగా చూడండి...
👇






image

Leave Your Comments