పోలీస్ స్టేషన్‌లోనే ఒంటికి నిప్పుంటించుకునిఆత్మహత్యాయత్నం....

Date: 2024-10-18
news-banner

అందరి టీవీ /డిజిటల్ /జనగాం ప్రతినిధి 
కాపాడబోయిన పోలీసులకు గాయాలు..!

జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడే సంఘటన జరిగింది. భార్యాభర్తల పంచాయతీలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని పట్టించుకున్నాడు. అతన్ని అడ్డుకుబోయిన పోలీసులకు ఆ నిప్పoటుకుని తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో స్పందించిన తోటి సిబ్బంది హుటాహుటీన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకలతండాకు చెందిన లాకవత్ శీను – అతని భార్య రాధిక మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు చెలరేగుతున్నాయి. భర్త వేధింపులు భరించలేక మనోవేధన గురైన రాధిక పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో శ్రీనును పోలీసులు పాలకుర్తి పోలీస్ స్టేషన్ పిలిపించారు. భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రములో ఒక్కసారిగా ఊగిపోయిన శ్రీనివాస్ తన వాహనంలోని పెట్రోలు తీసి తన ఒంటిపై పొసుకున్నాడు. అంతటితో ఆగకుండా వెంటనే నిప్పుంటించుకున్నాడు.
image

Leave Your Comments