పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన

Date: 2024-10-18
news-banner
అందరి టీవీ/ డిజిటల్ / హనుమకొండ ప్రతినిధి 

ఏబీవీపీ హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలని నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది .తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు గడిచిన ఇంకా విద్యార్థులకు బతుకులు మారలేదు నాయకులు మారుతున్నారు గాని విద్యార్థుల జీవితాలు మారడం లేదు ఇంతవరకు పెండింగ్లో స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు రాష్ట్రంలో 7500 కోట్లు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి వాటిని పట్టించుకోకుండా ఈ కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తుంది రోజుకో మాట చెబుతూ ముఖ్యమంత్రి రోజులు గడుపుతున్నాడు గాని విద్యార్థులను పట్టించుకోవడం లేదు ఈరోజు నిరసన చేస్తున్న విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తూ విద్యార్థులను విద్యార్థి నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రాలేక ఎంతో మంది విద్యార్థులు మధ్యలోనే వాళ్ళ చదువులను విడిచి పెడుతున్నారు డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు  ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది . ఈకార్యక్రమంలో నగర కార్యదర్శి తాళ్లపల్లి అరుణ్, జోనల్ ఇంచార్జ్ శ్రవణ్ కుమార్, సర్దార్, గణేష్, సందీప్, రాహుల్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు
image

Leave Your Comments