చరిత్ర మరువని యోధుడు కుమ్రం భీం.....

Date: 2024-10-18
news-banner

అందరి టీవీ /డిజిటల్ /కుమ్రం భీం ప్రతినిధి 
ఆదివాసుల పోరాట యోధుడు కొమురం భీం 84వ వర్ధంతి వేడుకలు  ఈరోజు జోడేఘాట్ లో ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ఆదివాసీ లతో పాటు, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.

కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలం సంకెపల్లిలో గోండు తెగకు చెందిన కుమ్రం చిన్నూ దంపతులకు 1901సంవ త్సరంలో కుమ్రం భీం జన్మించాడు. భూపట్టా దారులు, అటవీ సిబ్బంది చిత్రహింసలతో గ్రామస్తుల తో పాటు భీం కుటుంబం కూడా ఇబ్బందులు పడ్డది. 

ఈ క్రమంలో భీం తండ్రి చిన్నూ మరణించడంతో ఆ కుటుంబం కెరమెరి మండలం సుర్దాపూర్‌కు వలస వచ్చింది. అడవిని నరికి పోడు వ్యవసాయం ప్రారంభించారు.పంట చేతికి వచ్చే తరుణంలో సిద్ధిఖ్‌ అనే పట్టాదారుడు వచ్చి భూమి తనదేనంటూ ఆదివాసులు పండించిన పంటలు తనకే దక్కా లంటూ భయభ్రాంతులకు గురిచేశాడు. 

అతని అరాచకాలు భరించలేని ఆదివాసీలు తిరుగుబాటుకు సిద్ధమ య్యారు. వేధింపులను భరించలేక భీం కర్రతో దాడి చేయగా సిద్ధిఖ్‌ అక్కడి కక్కడే హతమయ్యా డు. నిజాం పోలీసులు భీంపై హత్య నేరం మోపగా భీం బాల్య స్నేహితుడు కొండల్‌ తో బల్లార్షా, చంద్రాపూర్‌ వైపు పయనమయ్యాడు.

అక్కడి నుంచి అస్సాం వెళ్లి తేయాకు తోటలో పని చేశాడు. రాంజీగోండు, అల్లూరిసీతారామారాజుల పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని సుర్దాపూర్‌కు తిరిగి వచ్చాడు. బాబేఝరి లో పోడు వ్యవసాయం ప్రారంభించాడు. 

నిజాం పోలీసులు అటవీ సిబ్బంది అక్కడికి వెళ్లగా భీం వారిపై ఎదురు తిరిగి పంపించాడు. బాబేఝరి భూసమస్య నిజాం ప్రభుత్వానికి, భీం మధ్య వివాదంగా మారి యుద్ధానికి దారితీసింది. జోడేఘాట్‌ కేంద్రంగా చుట్టుపక్కల 12 గ్రామాల ఆదివాసులను భీం ఏకం చేశాడు. 

గెరిల్లా తరహా పోరాటాలకు వారిని సిద్ధం చేశాడు. ‘జల్‌, జంగల్‌, జమీన్‌’ నినాదంతో పోరాటానికి భీం నాంది పలికారు.నిజాం ప్రభుత్వం అప్పటి ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ను రాయబారానికి జోడేఘాట్‌కు పంపింది. 12 గ్రామాలకు స్వాతంత్య్రం ప్రకటించాలని జైలులోని తన అనుచరులను వదిలి పెట్టాలని భీం షరతులు విధించాడు. 

దీనికి అంగీకరించని నిజాం సర్కార్‌ సైన్యాన్ని దింపింది. ఓ ద్రోహి ఇచ్చిన సమాచా రంతో జోడేఘాట్‌కు అర్ధరా త్రి చేరుకొని నిద్రిస్తున్న భీం అనుచరులపై ఏకపక్షంగా కాల్పులకు పాల్పడింది. 

దీంతో కుమ్రం భీం సేన పోరాటానికి దిగగా చివరికి నిజాం పోలీసుల తూటా లకు 1940 ఆశ్వీయుజ మాసం పౌర్ణమి రోజున కుమ్రం భీం వీరమరణం పొందాడు.

image

Leave Your Comments