అందరి టీవీ/ డిజిటల్ /డెస్క్ ప్రత్యేకం
అంజలి మీడియా గ్రూప్ 10 వ వార్షికోత్సవం సందర్భంగా హన్మకొండ లోని అంజలి మీడియా గ్రూప్ కార్యాలయసం లో ఏర్పాటు చేస్తున్న కాకతీయ మహానంది పురస్కారాల వేడుకలకు సంబందించిన సన్నాహక సమావేశం అంజలి మీడియా కార్యాలయం లో నిర్వహించారు. ఈ సందర్బంగా అంజలి మీడియా గ్రూప్ చైర్మన్ కామిశెట్టి రాజు పటేల్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం లో అందరూ పాలుపంచుకోవాలని వివిధ రంగాలలో కృషి చేసిన ప్రతిభ వంతులని గుర్తించి వారికీ పురస్కారం అందేలా చూడాలని అన్నారు . ఈ కార్యక్రమం లో స్టేట్ కారొస్పాండెంట్ జంగా రఘువీర్ యాదవ్ ,స్టేట్ కో ఆర్డినేటర్ ఎస్.కె . బాబర్,వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కామిశెట్టి రంజిత్ కుమార్ పటేల్ , మాడి శెట్టి రమేష్, కెమరామెన్ శ్రీను ఆకులా ,సంతోష్ ,ఆర్గనైజర్లు నాగ జ్యోతి ,ఎర్ర ప్రసూనా,ప్రియాంక రాచకొండ ,ప్రత్యుష ఆకుల ,అంజలి మీడియా డెస్క్ ఇంచార్జి మానస తదితరులు పాల్గొన్నారు.