అందరి టీవీ /డిజిటల్ : మహబూబాబాద్ ప్రతినిధి
దసరా కానుకగా ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ DA లు ప్రకటించాలి.
గతంలో ఎన్నడు లేని విధంగా ప్రభుత్వం 4 DA లను పెండింగ్లో పెట్టిందని TSTTF జిల్లా అధ్యక్షులు M. భద్రు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈరోజు మహబూబాబాద్ అధికార పార్టీ శాసనసభ్యులు Dr . మురళి నాయక్ కలిసి యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో దసరా కానుకగా పెండింగ్లో ఉన్న కరువు భత్యాలను వెంటనే విడుదల చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇచ్చి విజ్ఞప్తి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ నాయక్ ,జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్ సింగ్ గారు, మాల్సూర్ నాయ క్, మురళి నాయక్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.