అందరి టీవీ / డిజిటల్ : వరంగల్ ప్రతినిధి
వరంగల్ లోని పైడిపల్లి గవర్నమెంట్ హై స్కూల్ లో నిర్వహించిన అండర్-17 SGFI జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో విజ్ డమ్ హై స్కూల్ విద్యార్థిని పాల్గొని మంచి ఆట నైపుణ్యాన్ని కనబరిచినందుకు ఈనెల 6 వరకు గవర్నమెంట్ పాఠశాల కోస్గి నారాయణపేట జిల్లాలో జరుగు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు SGFI జిల్లా సెక్రటరీ సారంగపాణి గారు మరియు హ్యాండ్ బాల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గ్రేస్ మేడం గారు తెలిపినారు. ఈ పోటీలలో తమ పాఠశాలకు చెందిన 9వ తరగతికి చెందిన A. చందన పాల్గొననున్నట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రీడాకారిణి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి జాతీయస్థాయికి ఎంపికై నర్సంపేట ప్రతిష్టను ఇనుమడింపజేయాలని పాఠశాల కరస్పాండెంట్ జహంగీర్ గారు తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని అకాడమిక్ అడ్వైజర్ నాజియా ఇక్బాల్, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీం సుల్తానా, కోచ్ ప్రశాంత్ కుమార్, పిఈటీ లు రియాజ్, రాజేష్, పృద్వి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు