అంగన్వాడీ సెంటర్ లో సామూహిక శ్రీమంతం కార్యక్రమం...

Date: 2024-09-30
news-banner

అందరి టీవీ /డిజిటల్ :వరంగల్ ప్రతినిధి 
గ్రేటర్ వరంగల్ రెండవ డివిజన్ వంగపహాడ్ లోని అంగన్వాడీ  రెండవ సెంటర్ టీచర్ సమ్మక్క ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మక్క మాట్లాడుతూ పోషణ మాసం కార్యక్రమం లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రతీ నెల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని టీచర్ సమ్మక్క తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రాధమిక పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత,  ANM  సంపూర్ణ, హెల్త్ అసిస్టెంట్ డా. సుధాకర్ హాజరయ్యారు...
image

Leave Your Comments