అందరి టీవీ /డిజిటల్ :డెస్క్ ప్రత్యేకం
డ్రంక్ అండ్ డ్రైవ్ తఖీల సమయంలో మందుబాబులను కట్టడి చేసేందుకుగాను వరంగల్ ట్రాఫిక్ విభాగంలోకి బాడీ వార్న్ కెమెరాలు వచ్చేసాయి..ఇకపై మందుబాబులు తస్మాత్త్ జాగ్రత్తగా వుండాలని వరంగల్ ట్రాఫిక్ ఏసిపి సత్యనారయణ తెలియజేసారు. ట్రైసిటి పరిధిలో డ్రంక్ అండ్ డ్రై తనఖీతో పాటు శాంతి భద్రతల పర్యవేక్షణ విధులు నిర్వహించే సమయంలో ప్రజల నుండి ఎదురయ్యే సమస్యలను దాడులను నియంత్రించి పోలీస్ అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించేందుకుగాను పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయము నుండి మంజూరైన బాడీ వార్న్ కెమెరాలను వరంగల్ ట్రాఫిక్ ఎసిపి ట్రాఫిక్ అధికారులకు అందజేసారు. కమీషనరేట్ పరిధిలోని మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు మూడు చోప్పున బాడీ వార్న్ కేమెరాలను అందజేయడం జరిగింది. ఇక పై నగరంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు బాడీ వార్న్ కెమెరాలను ధరించి తనీఖీలు చేపట్టడం జరుగుతుంది. తద్వారా తనిఖీల సమయంలో ఎవరైన వాహనదారుడు పోలీసులపై దాడులకు పాల్పడిన, దూషించి, మరేతర విధులను ఆటంకపరిచే విధంగా ప్రవర్తించిన పోలీస్ అధికారి ఒంటి వున్న కెమెరా సంఘటన స్థలంలో జరిగిన వాస్తవాలను చిత్రికరించడం జరుగుతుంది. అలాగే ట్రాఫిక్ అధికారులు తనీఖీల సమయంలో పారదర్శకంగా విధులు నిర్వహించేందుకు అనవుగా వుంటుందని ఏసిపి తెలియజేసారు. ఈ కార్యక్రమములో ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్లు రామకృష్ణ, షూకూర్,నాగబాబుతో పాటు ట్రాఫిక్ ఎస్.ఐలు పాల్గోన్నారు.